అర్హులందరికీ. ధృవపత్రములు జారీ చేయండి
1 min readకమిషనర్ ఎ.భార్గవ్ తేజ. ఐ.ఏ.ఎస్.
పల్లెవెలుగు: జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా అర్హులైన అందరికి ధృవపత్రాలు అందచేయాలని కమిషనరు కమిషనర్ శ్రీ ఎ.భార్గవ్ తేజ గారు ఐ.ఏ.ఎస్. ఆదేశించారు. ఈ రోజు క్యాంపులు నిర్వహిస్తునటువంటి 6వ వార్డులో 16వ సచివాలయం గడ్డస్ట్రీట్ మరియు 30వ వార్డు లోని 100వ సచివాలయం అంబేద్కర్ కాలనీ జగనన్న సురక్ష క్యాంపులలో కమిషనర్ శ్రీ ఎ.భార్గవ్ తేజ గారు ఐ.ఏ.ఎస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భముగా కమిషనర్ గారు మాట్లాడుతూ మొత్తం యంత్రాంగము ప్రతి యింటిని సందర్శించి అర్హులైన అందరిని గుర్తించి వారికి అవసరమైన ధృవపత్రాలు అందచేసి వారికి లబ్ది చేకూరేలా చేసే కార్యక్రమం అని, ప్రజలందరూ వాలంటీర్ల ద్వారా జరుగుతున్న సర్వేలో పాల్గొనాలని, వారికి అవసరమైన పత్రాలు ఉచితంగా పొందాలని పిలుపునిచ్చారు. క్యాంపు నిర్వహణకై పలు సూచనలు చేసారు. లబ్దిదారుల సౌకర్యార్ధం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, రిజిస్ట్రేషన్ కౌంటరు, వెరిఫికేషన్ కౌంటరు, సర్వీస్ రిక్వెస్ట్ ప్రకారము పత్రములు అందచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రమాదేవి, ప్రత్యేక అధికారులు జునైద్ , మన్సూర్, కర్నూలు డిప్యూటీ తహశీల్దార్ శివరామ్ , 6వ వార్డు కార్పొరేటర్ షేక్ నిలోఫర్, 39వ వార్డు కార్పొరేటర్ సాంబశివరావు, యితర సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.