వైభవం…‘పరిడాల వారి’ నామకరణోత్సవం..
1 min readపల్లెవెలుగు:కర్నూలు నగరంలోని సంతోష్‌నగర్‌లో పి.శైలజ, పి.హరికృష్ణ దంపతుల గారాలపట్టి (కూతురు) నామకరణ మహోత్సవాన్ని తమ స్వగృహంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో కులదైవంను బిడ్డ చెవిలో ఉచ్చరించిన తరువాత… బిడ్డకు పెట్టబోయే పేరును మొదటగా మేనమామ ఆంధ్ర స్వప్నం పేపర్ ఎడిటర్ రాఘవేంద్ర గౌడ్ పలికారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛరణాల మధ్య చిన్నారి పేరు ‘ మోహన ప్రియ’గా నామకరణం చేశారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి… చిన్నారి మోహన ప్రియను ఆశీర్వదించారు. అంతకు ముందు మేనత్త కె.స్వప్నప్రియ, చిన్నారి అక్క మోక్షశ్రీ, హనీష్, యశిక, ద్రాక్షాయణి, లెహర్, ధృవంత్, బంధుమిత్రులు , స్నేహితులు చిన్నారిని దీవించారు. ఆ తరువాత నామకరణ మహోత్సవానికి వచ్చిన బంధుమిత్రులకు భోజనం ఏర్పాటు చేశారు.