PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిమ్మల్ని.. మరిచిపోలేం..

1 min read
ఉపాధ్యాయుడు రవిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న ఆళ్లగడ్డ గ్రామస్తులు

ఉపాధ్యాయుడు రవిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న ఆళ్లగడ్డ గ్రామస్తులు

మీరు నేర్పిన విద్య… మా భవిష్యత్​కు పునాది..
– ఉపాధ్యాయుడి వీడ్కోలు సభలో విద్యార్థులు

పల్లె వెలుగు , గడివేముల;
విద్యా వ్యవస్థలో సరికొత్త ఒరవడి సృష్టించిన ఓ ఉపాధ్యాయుడిని.. మిమ్మల్ని మర్చిపోలేం.. మీరు నేర్పిన విద్య… మా భవిష్యత్​కు పునాది..అంటూ మండలంలోని మజరా గ్రామమైన ఆళ్లగడ్డకు చెందిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వీడ్కోలు సభలో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళితే..
రవి అనే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవంబర్ 2010 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తి లో చేరాడు. దాదాపు పది సంవత్సరాలు పాఠశాల అభివృద్ధికి మరియు నైపుణ్యంతో కూడిన జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడానికి నిర్విరామముగా కృషి చేశారు. అంతేకాకుండా పిల్లల క్రమశిక్షణ, పాఠశాల మరియు తమ ఇంటి ఆవరణలో ఉండే పరిశుభ్రత గురించి బహు చక్కగా వివరించేవారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి.. అనే నినాదాన్ని చాలా బలంగా చెప్పాడు. టీచింగ్ లో ఉండే కొత్త కొత్త పద్ధతుల ద్వారా విద్యాబుద్ధులు నేర్పించేవారు. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల్లో మండల, జిల్లా స్థాయిలో ఆళ్లగడ్డ దే ప్రథమ స్థానంలో ఉండేటట్టు.. కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు ధీటుగా ఏ మాత్రం తగ్గకుండా ఉండేవిధంగా విద్యాబోధన తీర్చిదిద్దారని విద్యార్థులు వీడ్కోలు సభలో గుర్తు చేసుకున్నారరు. అనంతరం ఉపాధ్యాయుడు రవిని గ్రామ ప్రజలు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పూర్వపు ఉపాధ్యాయులు, మండల ఎంపీడీవో, మండల ఎంఈఓ … చాలా మంది ఊరేగింపుగా వచ్చి ఉపాధ్యాయునికి ఘనంగా వీడ్కోలు పలికారు.

About Author