‘జెమ్ కేర్’ ఆధ్వర్యంలో..ఉచిత వైద్యశిబిరం
1 min readపల్లెవెలుగు : కర్నూల్ నగరంలోని వడ్డేగేరిలోని మస్జిద్ మర్కజే ఇస్లామిలో జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. మస్జిద్ మర్కజే మేనేజింగ్ కమిటీ నేతృత్వంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 200మందికి షుగర్, బిపి, ఈసిజి, 2డి ఎకో పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా జేమ్కేర్ కామినేని హాస్పిటల్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంతోమంది పేదలు ఆర్థిక స్థోమత లేక రోగాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి వైద్య పరీక్షలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని తెలిపారు. వైద్య శిబిరం నిర్వహకులు మాట్లాడుతూ ఉదయం 10 నుంచి సాయంత్రం 2 వరకు వైద్య శిబిరం నిర్వహించామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని రకాల జబ్బులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం హర్షనీయమన్నారు. ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఉచితంగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రాఘవేంద్ర చెరుకు, డాక్టర్ జి వి ఎస్ రవిబాబు, డాక్టర్ వి హెచ్ శ్రుతి, కామినేని హాస్పిటల్ జనరల్ మేనేజర్ నదీమ్, డిజిఎం రమణ బాబు పాల్గొన్నారు.