NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మాజీ ఎమ్మెల్యే 59వ జన్మదిన వేడుకలు..

1 min read

– అన్ని వర్గాల ప్రజలలో సుస్థిర స్థానం సంపాదించిన మహోన్నత వ్యక్తి బడేటి బుజ్జి

–  రాష్ట్ర ఎస్సీ సెల్ సభ్యులు జాల బాలాజీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  స్థానిక భావిశెట్టివారి పేట  రాష్ట్ర ఎస్సీ సెల్ సభ్యులు జాలా బాలాజీ  ఆధ్వర్యంలో మూడవ డివిజన్ లో బుధవారం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి 59వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఏలూరు నగర చరిత్రలోనే ఎమ్మెల్యేగా ఐదేళ్లలో బడేటి బుజ్జి సుస్థిర స్థానం సంపాదించరని, అన్ని వర్గాల ప్రజాలలో చెరగని ముద్ర వేసి పేద ప్రజల హృదయాలలో మహోన్నత వ్యక్తిగా నిలిచిపోయారని కొనియాడారు. నగర నలుమూలలలో ఆయన జన్మదినన్ని ఒక పండుగలా జరుపుకోవడం ఆయన చేసిన పలు అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు సమక్షములో బడేటి బుజ్జి ప్రింట్ ఫోటో ఉన్న భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు బాలాజీ తెలిపారు. అనంతరం స్నాక్స్ ఏర్పాటు చేసి పండ్లు  పంపిణీ చేశారు.

About Author