పురుందేశ్వరి నీ మర్యాదపూర్వకంగా కలిసిన షబానా
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా నియమితులైన పురుందేశ్వరి ని బిజెపి జాతీయ మైనారిటీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా బుధవారం హైదరాబాదులోని వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మైనార్టీ వర్గాలు సహాయ సహకారాలు పార్టీకి అందించాలని కోరారు . అలాగే గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడానికి అమరావతి కి వెళ్తున్నట్టు జాతీయ మైనారిటీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా తెలిపారు .