PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

17 న బడుగు బలహీన వర్గాల సెమినార్..

1 min read

– కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మరియు

– ఎస్. సి,ఎస్.టి,బి. సి,మైనారిటీ నేతలు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  బడుగు బలహీనర్గాల రౌండ్ టేబుల్ కు సంబందించిన కరపత్రాలను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ,బడుగు  బలహీన వర్గాల ఐక్య వేదిక నాయకులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్ధయ్య , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్ ,జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ యూనుస్ భాష ,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బి. సి.విభాగం రాష్ట్ర కార్యదర్శి దే ధనుంజయ ఆచారి ,అఖిల భారత బి.సి రిజర్వేషన్ ల పోరాట సమితి  జాతీయ కార్యదర్శి బత్తుల లక్ష్మీ కాంతయ్య,కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్లు షైక్ యూనుస్ బాషా , షైక్ అహ్మద్ , ఫారజ్ ఖాన్ ,వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అది మోహన్ రెడ్డి , రైల్వే ప్రసాద్ , ఇర్ఫాన్ , తదితరులు విడుదల చేశారు. ఎస్. సి,ఎస్.టి,బి.సి,మైనారిటీ నేతలు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్. సి,ఎస్.టి,బి. సి,మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం “బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక ” అనే సంఘాన్ని స్థాపించినట్లు ఈ వేదికకు కన్వీనర్లు గా సి హెచ్.మద్ధయ్య ,మద్దూరు సుభాష్ చంద్రబోస్ ,షేక్  యూనుస్ బాష గారు,దేవపూజ ధనుంజయ ఆచారి ,బత్తుల లక్ష్మీ కాంతయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.వీరి ఆధ్వర్యంలో ఈ నెల 17 వ తేదీన కర్నూలు మండల పరిషత్ మీటింగ్ హాలు నందు “సామాజిక న్యాయం – జగనన్న తోనే సాధ్యం” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.దానికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో కలిసి విడుదల చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు మాట్లాడుతూ రౌండ్ టేబుల్ సమావేశానికి బడుగు బలహీనర్గాల నాయకులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీనర్గాల  ఐక్య వేదిక కన్వీనర్ లు సి.హెచ్.మద్దయ్య ,మద్దూరు సుభాష్ చంద్రబోస్ ,షేక్ యూనిస్ బాష ,ధనుంజయ ఆచారి , బత్తుల లక్ష్మీ కాంతయ్య మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి నియోజక వర్గంలో     సామాజిక న్యాయం జగనన్న తోనే సాధ్యం అనే అంశం పై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఉమ్మడి కర్నూలు జిల్లా లోని ఎస్. సి ,ఎస్.టి,బి. సి,మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని పిలుపు నిచ్చారు..ఇంకా ఈ కార్యక్రమంలో  ఆలూరు మాజీ జెడ్.పి.టి. సి సభ్యులు జి.రామ్ భీమ్ నాయుడు గారు తదితరులు పాల్గొన్నారు.ఈ నెల 17 వ తేదీన”సామాజిక న్యాయం – జగనన్నతోనే సాధ్యం” అనే అంశంపై నిర్వహించనున్న పాంప్లేట్స్మన కర్నూలు ఎమ్మెల్యే శ్రీ హఫీజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈకార్యక్రములొ సామాజిక న్యాయం కార్యక్రమం నిర్వహకులు CH మద్దయ్య గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిసుభాష్ చంద్రబోస్ గారు జిల్లా గ్రంథాలయ చైర్మన్. షేక్ యునుస్ భాషా గారు ఉమ్మడి కర్నూలు జిల్లాల మైనార్టీ జిల్లా ఆద్యక్ష్యులు YSRCP. దేవపూజ ధనుంజయ్య ఆచారి గారు రాష్ట్ర కార్యదర్శి బిసి విభాగం వైఎస్ఆర్సీపీ. బత్తుల లక్ష్మికాంతయ్య జాతీయ కార్యదర్శి అఖిల భారతీయ బిసి రిజర్వేషన్ల పోరాట సమితి. కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కార్పోరేటర్లు షైక్ యూనుస్ బాషా గారు, షైక్ అహ్మద్ గారు, ఫారజ్ ఖాన్ గారు,వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అది మోహన్ రెడ్డి గారు, రైల్వే ప్రసాద్ గారు, ఇర్ఫాన్ గారు,పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author