PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2డీజీ ఔష‌ధం క‌రోన మీద ఎలా పోరాడుతుందో తెలుసా..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: డీఆర్ డీవో అభివృద్ధి చేసిన 2డిజి ఔష‌ధానికి డ్రగ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా నుంచి నెల క్రిత‌మే అనుమ‌తి వ‌చ్చింది. అయితే.. ఈ ఔష‌ధాన్ని వైద్యులు ప‌ర్యవేక్షణ‌, సూచ‌న మేర‌కు మాత్రమే తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తారు. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన ల‌క్షణాలు ఉన్నవారు త్వర‌గా కోలుకునేందుకు 2డీజి తీసుకొచ్చారు. గ‌రిష్ఠంగా ప‌దిరోజుల లోపు వాడాల‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌ధుమేహ వ్యాధి అదుపులో లేనివారు, మూత్రపిండ‌, కాలేయ స‌మ‌స్యలు, తీవ్రమైన గుండె స‌మ‌స్యలు, శ్వాస సంబంధిత స‌మ‌స్యలు ఉన్నవారు ఈ ఔష‌ధం వాడ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. గ‌ర్భిణులు, పాలిచ్చే త‌ల్లులు, 18 ఏళ్లలోపు వారు వాడ‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు.
ఇది ఎలా ప‌ని చేస్తుందంటే..
ఈ 2డీజీ ఔష‌ధం పొడి రూపంలో సాచెట్ ల‌లో ల‌భిస్తుంది. నీళ్లలో క‌లుపుకుని తాగితే.. వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుంది. వైర‌స్ సోకిన క‌ణాల్లో నేరుగా చేర‌డం దీని ప్రత్యేక‌త‌. ఫ‌లితంగా కోవిడ్ రోగులు త్వర‌గా కోలుకోవ‌డానికి స‌హ‌క‌రిస్తుంద‌ని క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ లో గుర్తించారు.

About Author