PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్వాక్రా అర్బన్ డెవలప్మెంట్ స్టాల్ ప్రారంభించిన మేయర్

1 min read

– భర్తకు చేదోడు వాదోడుగా మహిళలు ఉంటేనే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశం..

– మహిళల అభివృద్దే ధ్యేయంగా  మెప్మా ఆధ్వర్యంలో డోక్రా అర్బన్ మార్కెట్ ప్రారంభం..

– మెప్మా పీడీ ఇమ్మానియేల్

పల్లెవెలుగు ,వెబ్  ఏలూరు : మహిళల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి  సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని నగర మేయరు  షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు  అన్నారు.  గురువారం స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో  మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డ్వాక్రా అర్బన్‌ మార్కెట్‌ స్టాల్స్‌ను గురువారం ఆమె ప్రారంభించి, స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని  ఆదేశాల మేరకు డ్వాక్రా అర్బన్‌ మార్కెట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మహిళలు వివిధ రకాల చేతివృత్తులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనేదే ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ముఖ్య ఉద్దేశ్యమని, దానిలో భాగంగానే మహిళల అభివృద్ధి కోసం  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అన్నమాట ప్రకారం డ్వాక్రా మహిళలకు సున్న వడ్డీ పథకాన్ని అమలు చేశారన్నారు. అలాగే డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న అనేక ఉత్పత్తులసు, చేనేత వస్త్రాలను విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నారన్నారు. మెప్మా అర్బన్‌ మార్కెట్ల ద్వారా డ్వాక్రా మహిళలు తయారుచేసిన అన్ని రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వాటిని అమ్మకాలు చేయడం ద్వారా వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి  డ్వాక్రా అర్బన్‌ మార్కెట్లను ప్రతినెలా ఏర్పాటు చేయాలని ఆదేశించరని, అందులో భాగంగా ప్రతినెల ఒకరోజు డ్వాక్రా అర్బన్‌ మార్కెట్ను ఏర్పాటుచేసి డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించమన్నారు. ప్రజలు డ్వాక్రా ఉత్పత్తులకు పూర్తిగా సహకరించాలని, ప్రస్తుత రోజుల్లో అంతా ఆన్లైన్‌ వ్యాపారం జరుగుతుండడంతో ఈ–కామర్స్‌ విధానం ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కాట్‌  సంస్థల్లో కూడా మన డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను నేరుగా కస్టమర్‌ అడ్రస్ ప్రోడక్ట్‌ను డెలివరీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని క్వాలిటీ ఉత్పత్తులను తయారు చేసి ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు ఉపయోగించుకోవాలని మేయరు షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ఎన్. సుధీర్‌బాబు, జి శ్రీనివాస్, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయ నిర్మాలా, కో ఆప్షన్ సభ్యులు నీత విజయ్ కుమార్ జైన్, గంపల బ్రహ్మవతి, మెప్మా పీడీ ఇమాన్యు ల్, వైసీపీ నాయకులు తోట శివ, తదితరులు పాల్గొన్నారు.

About Author