కన్నుల పండువగా సుబ్రమణ్య స్వామి జన్మదినోత్సవ వేడుకలు
1 min read– భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రం
పల్లెవెలుగు వెబ్ , కమలాపురం : మండలం శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో నిత్య కళ్యాణ దేవతా మూర్తిగా వెలుగొందుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆయన జన్మదిన ఆషాడ మాస కృత్తిక నక్షత్రం ఆడికృత్తిక మహోత్సవం, అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారి జన్మదినోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. పార్వతీ పరమేశ్వరుల ప్రియ పుత్రుడైన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం రోజు న, అవతరించినట్లుగా శాస్త్రాలు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ భువి లో ఎక్కడా లేని విధంగా కమలాపురం మండలం శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి శ్రీ వల్లి దేవసేన దేవసేన సమేతంగా గత తొమ్మిది సంవత్సరాలుగా నిత్య కళ్యాణ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా వేదక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శత అష్టోత్తర కలశాభిషేకం ,కావడి సేవ, కాలసర్ప దోష సర్ప దోష నాగ దోష రాహు కేతు దోష నివృత్తి హోమాలతో పాటు రుద్ర హోమం సుబ్రహ్మణ్య స్వామి హోమం నిర్వహించారు సాయంత్రం మయూర వాహనంపై మాడవీధుల లో స్వామి వారి ఊరేగింపు ఉత్సవం జరిగిందిశ్రీ వల్లి దేవసేన మూలవిరాట్ లకు మహా మంగళహారతి కనుల పండుగ గా జరుగునాయిఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తాదులకు పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్ల చేసినారు ఆలయ వేదపండితులు జగదీష్ శర్మ ప్రదీప్ శర్మ మారుతి రామ శర్మల ఆధ్వర్యంలో పూజా సేవలు నిర్వహించారు ఆడి కృత్తిక మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆలయ సేవకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని హరిహరాదులను దర్శించుకున్నారు.