ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను సద్వినియోగం చేసుకోండి
1 min read– జేసీ( అభివృద్ధి) డా మనిజీర్ జలాని సమూహాన్
పల్లెవెలుగువెబ్, కర్నూలు: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి దాతలు ఇచ్చే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆభివృద్ధి) మరియు ఐ.ఆర్.సి.యస్. చైర్మన్ అయిన డాక్టర్ మనిజీర్ జలాని సమూహాన్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కర్నూల్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జేసీ మరియు ఐ.ఆర్.సి.యస్. చైర్మన్ డాక్టర్ మనిజీర్ జలాని సమూహాన్ 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను ప్రభుత్వ వైద్యశాల కర్నూల్ వారికి అందచేశారు. బుధవారం ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారు డొనేట్ చేయగా రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి కర్నూల్ బ్రాంచ్ కి మొదటి విడతగా 6 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 20 పల్స్ ఆక్సిమీటర్స్ ను ఇవ్వడం జరిగింది.
వీటిని సద్వినియోగం చేసుకోవలిసినదిగా జాయింట్ కలెక్టర్ కోరియున్నారు. ఈ కార్యక్రమములో స్పెషల్ ఆఫీసర్ టి. నాగరాజు నాయుడు, డి.ఆర్.డి.ఎ. పీడీ వెంకటేశ్వర్లు, స్టేట్ ఐ.ఆర్.సి.యస్. బ్లడ్ బ్యాంకు కోఆర్డినేటర్ డాక్టర్ గోవింద రెడ్డి, ఏ.క్ష. చైర్మన్ శ్రీనివాసులు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రామచంద్ర రావు మరియు పరిపాలన ఆధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.