కారాలు మిరియాలు.. రెస్టారెంట్ ని ప్రారంభించిన మేయర్
1 min read– యువత స్వశక్తితో తమ కాళ్ళపై తాము నిలబడటం అభినందనీయం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : స్థానిక టూ టౌన్ ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసినకారాలు మిరియాలు మల్టీ కుజన్ రెస్టారెంట్ ను నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెస్టారెంట్ రంగంలో నైపుణ్యం ,అపార అనుభవం ఉన్న యువత ప్రభుత్వం పై ఆధారపడకుండా స్వశక్తితో తమ కాళ్ళపై తాము నిలబడి. పదిమందికి ఉపాధి చూపించే మార్గాన్ని ఎంచుకొని తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని ఉన్నత శిఖరాల వైపు పయనించటం అభినందనీయమని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కొని ఆడారు. నాడు మహిళలు వంటగదిలకే పరిమితమైన నాటినుండి నేడు ఆధునిక యుగంలో మగవారు కూడా హోటల్ మేనేజ్మెంట్ ద్వారా రుచికరమైన పసందైన వంటకాలు తయారు చేయడంలో తక్కువ ఏమి కాదని నిరూపిస్తున్నారన్నారు. రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు పడినవారు అచ్చ తెలుగువారి వంటకం కరువైన ఈ రోజుల్లో ఘాట్ ఎక్కించే (కారాలు మిరియాలు) నామంతో ఎక్కువమందిని ఆకర్షించే విధంగా మల్టీ క్విజ్ రెస్టారెంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ సొంత ఫామ్ హౌస్ లో పండించిన కారాలు మిరియాలు మరియు తెలుగువారి వంటకు స్వచ్ఛమైన తాజా సరుకులను వినియోగించి వెజ్ అండ్ నాన్ వెజ్, భోజనం తో మీ ముందు సిద్ధంగా ఉంచడానికి ఆహ్వానిస్తున్నామన్నారు. ఒక్కసారి విచ్చేసి రుచి చూసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మరియు ఆశీర్వదించవలసిందిగా నిర్వాహకులు కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరంలోని వ్యాపార ప్రముఖులు, రకరకాల వ్యాపారస్తులు, అన్ని పార్టీల నాయకులు, మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొని వ్యాపార అభివృద్ధిలో మరింత రాణించాలని ఆకాంక్షించారు.