జగనన్న సురక్ష- పేదలకు రక్ష
1 min read– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: జగనన్న సురక్ష పేద ప్రజలకు రక్ష అని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, గురువారం సాయంత్రం ఆయన చెన్నూరు లోని గ్రామ సచివాలయంలో-2 లో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మాట్లాడుతూ, గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు, అయితే అర్హులై ఉండి ఇంకా కొంతమందికి సంక్షేమ పథకాలు అందకుండా ఉండే వారికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు, దీని కొరకు వాలంటీర్లు ఇంటి ఇంటికి తిరిగి అక్కడ ప్రజలకు ఉన్న ఇబ్బందులను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు, దీంతో ఎన్నో రోజులుగా అపరిస్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా జగనన్న సురక్ష ద్వారా పరిష్కరించ బడ్డాయని ఆయన తెలిపారు, అంతేకాకుండా ప్రజలకు అవసరమైన 11 రకాల సర్టిఫికెట్లు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు, ఇందులో డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్కు ఫోన్ నంబర్ లింక్, వంటి సర్టిఫికెట్లను ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే వాలంటీర్లు, వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పేద ప్రజలకు మరింత సేవలు అందించేందుకు ఒక మంచి ఆలోచనతో, వినూత్నంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు, పాదయాత్రలో ఆయన ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నవరత్నాల భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించడం జరిగింది అన్నారు, ప్రజలకు ఏవైతే చెప్పారో, వాటన్నిటిని కూడా నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిదే నని ఆయన కొనియాడారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనని సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించిన గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిలను చూసి ఉంటాం కానీ చరిత్రలో కొంతమందే నిలబడతారని అందులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు, చెన్నూరు గ్రామపంచాయతీ2 లో 1548 ఇండ్లకు గాను 1138 లబ్ధిదారులకు వివిధ రకాల సర్టిఫికెట్లకు అంద చేయడం జరిగిందన్నారు, అలాగే చెన్నూరు సచివాలయం-2 లో 20 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు, ఇందులో వాలంటీర్ల కృషి ఎంతో ఉందని వారి సేవలు ఎన్నటికీ మరచిపోలేని సేవలని ఆయన గ్రామ వాలంటీర్లను అభినందించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టికల్చర్ సలహా దారులు సంబటూరు ప్రసాద్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, వారిష్, శ్రీనివాసరాజు, రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి,మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ప్రతాపరెడ్డి, మైనార్టీ నాయకులు అన్వర్ భాష, హస్రత్ ఎంపీటీసీలు, రఘురామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, దుంప నాగిరెడ్డి, సర్పంచులు, సిద్దిగారి వెంకటసుబ్బయ్య, తుంగ చంద్రశేఖర్ యాదవ్, సుదర్శన్ రెడ్డి, సొంటం నారాయణరెడ్డి, అధికారులు, తాసిల్దార్ పఠాన్ అలీ ఖాన్, ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.