ఆగస్టు నెల ఆఖరి నాటికి భూ సర్వే వెరిఫికేషన్ పూర్తి : జాయింట్ కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఆగస్టు నెల ఆఖరి నాటికి గ్రామాల భూ సర్వే వెరిఫికేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రీసర్వే అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలు నందు రీసర్వే అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా 25 గ్రామాలకు సంబంధించి గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి అయిన వివరాలు తహశీల్దారు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ లాగిన్ లలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే పూర్తి చేసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా వారి భూముల వివరాలను సరైన రీతిలో ఆన్లైన్ నందు నమోదు చేయడం కోసం రీసర్వే అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా అదే విధంగా ప్రభుత్వ భూములకు నష్టం జరగకుండా వెరిఫై చేసి ఎంత వరకు ప్రభుత్వ భూమి ఉంది ? ఎంత వరకు పట్టా భూమి ఉంది అనే దాని కోసం ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా డిప్యూటీ తహశీల్దార్లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలను మొత్తం పురిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు నెల ఆఖరి నాటికి గ్రామాలను మొత్తం ప్యూరిఫికేషన్ పూర్తి చేసి రైతులకు భూహక్కు పత్రాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అందులో రైతులకు అవసరమైన వివరాలతో పాటు వారి పొలం వివరాలు స్కెచ్ తో కూడా ఉండడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ద్వారా రైతుల భూమికి హక్కు కల్పిస్తూ వారి పొలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని రైతుకు తెలియజేస్తూ వారికి హక్కు కల్పించడం జరుగుతుందన్నారు.సమావేశంలో కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగప్రసన్నలక్ష్మి, కర్నూలు ఆర్డిఓ హరిప్రసాద్, కెఆర్ఆర్సి తహశీల్దారు వసుంధర, సర్వే ఏడి రామ్మోహన్, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు, రీసర్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.