NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెగా జాబ్ మేళా కు విశేష స్పందన..

1 min read

పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో  జిల్లా అభివృద్ధి సంస్థ నంద్యాల జిల్లా వారి సహకారంతో  నందికొట్కూరు  శాసనసభ్యులు  తొగురు ఆర్థర్  ఆధ్వర్యంలో  శుక్రవారం నిర్వహించిన    మెగా జాబ్ మేళా కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత జాబ్ మేళకు భారీ ఎత్తున హాజరయ్యారు. 15 ప్రముఖ కంపిణీ లకు చెందిన ప్రతినిధులు ఇంటర్యూలు నిర్వహించారు. ఈ జాబ్ మేళా కు దాదాపు 600మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి , జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి  ప్రతాపరెడ్డి , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్  సునీత , వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధి బృందం, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , మున్సిపల్ వైస్ చైర్మన్  మొల్ల. రబ్బానీ , కౌన్సిలర్లు  ఉండవల్లి ధర్మారెడ్డి ,  జాకీర్ హుస్సేన్ , జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షులు  సగినేల వెంకటరమణ , జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు  చంటిగారి దిలీప్ రాజు, నందికొట్కూరు సింగిల్ విండో అధ్యక్షులు  సగినేల హుస్సేనయ్య , బ్రాహ్మణకొట్కూరు సింగిల్ విండో అధ్యక్షులు మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి  పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు, పాల్గొన్నారు.

About Author