వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక ఆదరణ డేకేర్ సెంటర్ నందు శుక్రవారం వృద్ధులకు శంకర్ శర్మ ఆర్థిక సాయంతో దుప్పట్లు వారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మాట్లాడుతూ సీజన్లో మార్పులకు వస్తున్నాయి కాబట్టి నిరుపేదలైన వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాల సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే నీటిని వేడి చేసి కాచి తాగితే ఆరోగ్య సమస్యలు రావు అన్నారు .రాబోతున్న చలికాలంలో దృష్టిలో ఉంచుకొని వృద్ధులకు దుప్పట్లో అందించడం జరిగిందన్నారు. వృద్ధులకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని నా శక్తి కొలది గొప్ప సమాజానికి సహాయం చేసే కార్యక్రమం కాబట్టి చేతనైనంత సహాయం చేయాలనేదే నా కోరిక ముఖ్యంగా వృద్ధుల విషయంలో ఇంటిలోని తల్లిదండ్రుల ను సరిగ్గా చూసుకోవడం లేదు అన్నారు. ఈ సంస్థను రంజిత్ కుమార్ అభినందించడం నాకు ఎంతో ఆనందం కలిగిందన్నారు. ఈ సంస్థ రంజిత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఎంతోమంది ధనికులు ఉన్నారు కానీ పేదలకు సాయం చేయలేని వారు వారి ఆకలి తీర్చలేనివారు డాక్టర్ శంకర్ శర్మ ఎంతో ఉదారమైన మనసుతో ఎన్నో కార్యక్రమాలు మాలాంటి వారికి సంస్థలతో సహాయము అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ,వృద్ధులు, రాఘవేంద్ర ,తదితరులు పాల్గొన్నారు.