చెన్నూరు విద్యార్థికి త్రిబుల్ ఐటిలో స్థానం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు 576 సాధించిన సయ్యద్ మగ్ధుమ్ సాహెబ్ దర్గా పీఠాధిపతులు సయ్యద్ మగ్ధుమ్ సాహెబ్ మనుమడు, సయ్యద్ అమినుల్లా కుమారుడు, సయ్యద్ అన్వర్ హుసైని కి ఇడుపులపాయ లోని త్రిబుల్ ఐటీ లో సీటు రావడం జరిగిందని సయ్యద్ అమినల్లా తెలిపారు, ఆయన శనివారం చెన్నూరులో విలేకరులకు మాట్లాడుతూ, నేను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నానని అన్నారు, అలాగే నా కుమారుడు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనే సంకల్పంతో, నా కుమారుడు సయ్యద్ అన్వర్ హూ సైని, నీ ప్రైవేట్ పాఠశాలల్లో చదవకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించడం జరిగిందన్నారు, అలాగే నా బిడ్డ పదవ తరగతిలో అత్యధిక మార్కులతో పాస్ కావడం జరిగిందన్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాలలను, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉంచడమే కాకుండా విద్యా విధానంలో పలు సంచలమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు, నేడు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అత్యధిక మార్కుల తో ఉత్తీర్ణత సాధించడం జరుగుతుందన్నారు, ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడం, నాణ్యమైన విద్యుత్ తో పాటు, రుచికరమైన భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడంతో విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు, ఇంత గొప్పగా విద్యను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలియజేశారు.