విలువిద్య సాధన వల్ల… ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు..
1 min read– ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన దేశ సంప్రదాయ క్రీడ అయినా విలువిద్యలో సాధన చేయడం వల్ల విద్యార్థులు మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణిస్తారని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగరంలోని శంకరాశ్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి విలువిద్య ఎంపిక పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు విలువిద్యలో సాధన చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. క్రీడలతోపాటు అన్ని రంగాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వివరించారు మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. సమాజంలో మహిళలు వివక్షత గురవుతున్నారని ,ఆ పరిస్థితిని తప్పించాలంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. ప్రస్తుతం పురుష క్రికెటర్లకు సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు ఇచ్చేందుకు నిర్ణయించడం అభినందనీయమని చెప్పారు. ఇకపోతే విలువిడ్య మనదేశంలో వేల సంవత్సరాలు క్రితమే ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఈ విలువిద్యలో సాధన చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని దీనికి తోడు ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల చదువులో రాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే జీవితంలో స్థిరపడే అవకాశం ఉందని చెప్పారు .క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు గెలుపు ఓటమి గురించి కాకుండా తమ దేహదారుడాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లో మాయాజాలంలో చాలామంది వ్యాయామానికి దూరమై ఒబెసిటి,బీపీ,షుగర్ వంటి సమస్యలతో బాధపడుతు న్నారని చెప్పారు.