PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు

1 min read

– అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డి

పల్లవెలుగు వెబ్ నంద్యాల:  వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను నియంత్రించేందుకు పోలీసులతో పాటు రెవెన్యూ, వ్యవసాయ, ఉన్నత విద్యా, దేవాదాయ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో  మత్తు పదార్థాల నియంత్రణ అమలుపై సంబంధిత కమిటీ సభ్యులతో  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, అడిషనల్ ఎస్పీ జి.వెంకట రాముడు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, నంద్యాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిదిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి గంజాయి ఇతర మత్తు పదార్థాలపై దాడులు నిర్వహించి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైతే మత్తు పదార్థాలు లభ్యమవుతున్నాయో ఆయా ప్రదేశాలను గుర్తించి పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులు సహకరించాలని ఎస్పి సూచించారు. అన్ని విద్యాసంస్థలు కళాశాలల్లో విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మత్తు పదార్థాల కలిగే నష్టాలు నియంత్రణపై సంపూర్ణ అవగాహన కల్పించాలని  సంబంధిత కళాశాలల యాజమాన్య కమిటీలను సూచించారు. జిల్లాలోని ఆసుపత్రులలో డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి మత్తుకు బానిసైన వ్యక్తులలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్లను సూచించారు. ముఖ్యమైన కూడళ్లలో  మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణకు సంబందించిన హోర్డింగ్ లను   ఏర్పాటు చేసి యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా చూడాలన్నారు.

About Author