PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్​..

1 min read

– విజయవనం (పుల్లయ్య పార్కు) అభివృద్ధికి ఆకర్షణీయంగా డిజైన్ లు రూపొందించండి

– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విజయవనం (పుల్లయ్య పార్కు) అభివృద్ధి కోసం ఆకర్షణీయంగా డిజైన్ లు  రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. కర్నూలు నగర శివారులో ఉన్న విజయవనం (పుల్లయ్య పార్కు) ను అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో   మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజ, డిఎఫ్ఓ శివ శంకర్ రెడ్డి,ఆర్కిటెక్ట్ తో కలిసి ఆదివారం విజయ వనాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  సూచనల మేరకు కర్నూలు నగర శివారులో ఉన్న విజయవనం (పుల్లయ్య పార్కు) అభివృద్ధి కోసం 10కోట్ల రూపాయలతో పర్యాటక పరంగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు.. అందుకనుగుణంగా  యోగా సెంటర్, యాంఫి థియేటర్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసేందుకు  డిజైన్ లను రూపొందించాలని ఆర్కిటెక్ట్ కు జిల్లా కలెక్టర్ సూచించారు. అదే విధంగా హైదరాబాద్ లో ఉన్న పాలపిట్ట సైక్లింగ్ పార్కు, బటర్ ఫ్లై గార్డెన్, మొఘల్ గార్డెన్ తరహాలో సైక్లింగ్ పాత్, వాకింగ్ పాత్ ఏర్పాటు చేయాలన్నారు. పార్కు సుందరీకరణ పనులు వేగంగా జరిగేందుకు గాను సొసైటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఫుడ్ కోర్టు కూడా వనం బయటనే ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.విజయవనం (పుల్లయ్య పార్కు)ను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, డిఎఫ్ఓలతో కలిసి పరిశీలించారు. అనంతరం వెంగన్నబావి సమీపంలో ఉన్న దేవాలయాన్ని కూడా  పరిశీలించి ఆ ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా కలెక్టర్ వెంట ఆర్కిటెక్ట్ జి.శ్రీనివాస మూర్తి, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author