PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాన్సిలియేషన్ ఆఫీసర్ కొరకు దరఖాస్తులు ఆహ్వానం

1 min read

– వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పి. విజయ
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : జిల్లాలోని వయోవృద్దుల జీవన భృతి మరియు సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి అప్పీలేట్ ట్రిబ్యునల్ లో కాన్సిలియేషన్ ఆఫీసర్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్ల జిల్లా విభిన్న ప్రతిభవంతులు, హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, జిల్లా మేనేజర్ పీ. విజయ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తల్లితండ్రుల సంరక్షణ చట్టం 2007 చాప్టర్ v రూల్ 22 ( i ) ప్రకారము జిల్లా లోని మూడు డివిజన్లలో ట్రిబునల్స్ ఏర్పాటు చేయబడినవని, ఇదే విధంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన అప్పిలేట్ ట్రిబునల్స్ ఫర్ మెయింటెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్టు 2007 అమలు చేయుటకు పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు జాయింట్ కలెక్టరు ( ఆసరా మరియు వెల్ఫేర్​) ను కలెక్టరు చే నియమించారు. ఈ జిల్లా స్థాయి అప్పిలేట్ ట్రిబునల్ లో సెక్షన్ 6, 18 ప్రకారము కన్పిలియేషన్ అధికారిగా నియమించుటకు దరఖాస్తులు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి స్వీకరిస్తున్నామన్నారు. పోస్టుకు క్రింది అర్హతలు కలిగియుండవలెనన్నారు.
అర్హతలివే..

  • వయో వృద్ధులై స్వచ్చంధ సంస్థ కలిగి వుండి , వయో వృద్ధులు , బడుగు బలహీన వర్గాల కొరకు విద్య , వైద్య , పేదరిక నిర్మూలన , మహిళ సాధికారిత , సాంఘిక సంక్షేమము, గ్రామీణాభివృద్ధి కొరకు పని చేస్తూ ఉండాలి. కనీసము 2 సంవత్సరాలు అనుభవం కలిగిన ఉండాలి.
    – ఏదేని స్వచ్చంధ సంస్థలో ఉన్నత పదవిలో వున్న వారు, ప్రజా సేవలో ఎటువంటి మచ్చలేని వారై కనీసము 2 సంవత్సరాలు అనుభవం కలిగిన వారై ఉండాలని, చట్టం న్యాయశాస్త్రముల పట్ల అవగాహన కలిగిన వారై ఉండాలి.
  • పై అర్హతలుండి. ఆసక్తి కలిగిన వారు స్వచ్చంధంగా విధులు నిర్వహించుటకు సంబంధిత ధృవీకరణ పత్రములు జతచేసి, దరఖాస్తును ఈ నెల 10 వ తేదీ లోపుగా సహాయ సంచాలకులు , విభిన్న ప్రతిభావంతులు , హిజ్రాల,వయో వృద్ధుల సంక్షేమశాఖ , కలెక్టర్ కాంప్లెక్స్ , కర్నూలు వారికి పంపగలరని ఏపీడీ విజయ వెల్లడించారు. దరఖాస్తులను పరిశీలించి అర్హత మేరకు ఎంపిక చేస్తామని ఏడీ పేర్కొన్నారు.

About Author