పత్రిక స్వేచ్ఛను కాపాడాలి… ఏపియూడబ్ల్యూజే
1 min read– అధ్యక్షులు అమీర్ సాబ్ అధ్యక్షులు సిహెచ్ నాగరాజ్,,
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహానంది వార్త విలేఖరి మధు పై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సమక్షంలోనే విలేకరిపై దాడి జరుగుతుంటే ఎంత అమానుష సంఘటన ప్రతి ఒక్కరూ ఆలోచించే అవసరం ఎంతైనా ఉందని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జర్నలిస్ట్ పై కక్ష తీసుకుంటారని ఆవేదం వ్యక్తం చేశారు. మహానందిలో జరుగుతున్న భూ ఆక్రమాలను పరిశీలన చేసి నిజాన్ని నిర్భయంగా వార్త రూపంలో ప్రచురణ చేశారని ఇది సహించలేని వైసీపీ పార్టీకి చెందిన కొందరు ఆతినిపై కక్ష పెంచునని జగనన్న సురక్ష కార్యక్రమం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అండ దండాలతో అతి దారుణంగా దాడికి పాల్పడిన ఘటన మహానందిలో జరిగిందన్నారు. ఇలాంటి మరల జరగకుండా చర్యలు చేపట్టాలని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఆలూరు ఆఫ్ ఇంచార్జ్ విరుపాక్షి నాగరాజ్ రవి నాగప్ప ముదస్సిర్ మంజు మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగయ్య తదితరులు పాల్గొన్నారు.