కరోనాను తరిమికొడితే.. రూ. 50 లక్షలు..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ ను గ్రామాల్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు పాటించి.. విజయం సాధించిన గ్రామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల పారితోషికం ప్రకటించింది. గ్రామాల్లోకి పాకుతున్న కరోన వైరస్ ను నిలువరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోన ఫ్రీ విలేజ్ లను ప్రోత్సహించడం ద్వార కరోన కేసులు కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ నియంత్రణను సమర్థంగా నిర్వహించిన గ్రామాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రసంశించారు. మిగిలిన గ్రామాలను కూడ కరోన ఫ్రీ గ్రామాలుగా మార్చేందుకు కరోన ఫ్రీ విలేజ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి హసన్ ముష్రిఫ్ తెలిపారు. ప్రతి రెవెన్యూ డివిజన్ నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేసి.. మొదటి గ్రామానికి రూ.50 లక్షలు, రెండో గ్రామానికి రూ.25 లక్షలు, మూడో గ్రామానికి రూ.15 లక్షల పారితోషికాన్ని ప్రకటిస్తామని తెలిపారు.