బిసి మహిళా సిఐ మీద పవన్ కళ్యాణ్ ఫిర్యాదు పై మండిపడ్డ గుడిసె శివన్న
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు . శ్రీకాళహస్తి మహిళా సిఐ అంజు యాదవ్ మీద ఫిర్యాదు ఇవ్వడానికి ఇంతమంది వచ్చారంటే ఆ సిఐ ఏంత కరెక్ట్ గానే డ్యూటీ చేసింది అని అర్ధం చేసుకోవచ్చు. ఓ బిసి మహిళా శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ పై ఫిర్యాదు చేయడానికి ఒక పార్టీ అధినేత రావడం సిగ్గుచేటన్నారు. నిజాయితీగా పేరున్న మహిళా అధికారి పైన తప్పుడు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వారిని చూసి జాలిపడాల్సివస్తుందనిగుడిసె శివన్న అన్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీఛార్జి చేయాల్సిన సమయంలో సమయస్ఫూర్తితో చేంప మీద ఒక్క దెబ్బకు పవన్ కళ్యాణ్ వచ్చి ఫిర్యాదు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ అధినేత అయిఉండి ఏ దానిపైన ఏలా స్పందించాలో తేలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంజు యాదవ్ స్థానంలో అగ్రవర్ణాలకు చేందిన అధికారులు అయి ఉంటే ఫిర్యాదు చేసే వారా పవన్ కళ్యాణ్ గారు అని గుడిసె శివన్న ప్రశ్నించారు. మీరు బిసిల పట్ల చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. ఈ రోజు మీ వారాహి యాత్ర సజావుగా సాగడానికి పోలీసులు ఎంత శ్రమ శ్రద్ధ చూపడం జరుగుతోందో మీకు అర్ధం కావడం లేదా పవన్ కళ్యాణ్ గారు మీరు తక్షణమే మీ తప్పును తెలుసుకుని కేసు వాపాసు తీసుకుని పోలీసులకు క్షమాపణలు చేప్పాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారు. బిసి తడాఖా ఏందో నీకు మీ అభ్యర్థులకు వచ్చే ఎన్నికల్లో మా బిసిలు తప్పకుండా చూపిస్తారని గుడిసె శివన్న హెచ్చరించారు.