PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరు వ్యాపారులకు జగనన్న తోడు..

1 min read

– 7వ విడతలో 21,048 మంది లబ్ధిదారులకు రూ . 22.66 కోట్లు  వడ్డీలేని రుణాలు.. 

– డిసెంబర్ 2022 వరకు 19,627 మంది లబ్ధిదారులకు రూ .42 లక్షలు వడ్డీ రాయితి..

– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : చిరువ్యాపారులు, సాంప్రదాయ వృత్తులవారి ఉపాధికి ఊతంగా జగనన్న తోడు నిలుస్తోందని జిల్లా కలెక్టర్ వె . ప్రసన్న వెంకటేష్ అన్నారు. మంగళవారం జగనన్న తోడు పథకం 7వ విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు , జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించినవారికి సంబంధించిన వడ్డీ రాయితీని నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమచేసే కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్ . జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వె . ప్రసన్న వెంకటేష్ , జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు,జాయింట్ కలెక్టర్ పి.లావణ్య వేణి,డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు , మెప్మా పిడి ఇమ్మనియల్ , పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ చిరువ్యాపారులు సాంప్రదాయ వృత్తులవారికి జగనన్న తోడు అపన్న హస్తంగా నిలుస్తోందన్నారు . జగనన్న తోడు పథకం 7వ విడత కింద ఏలూరు జిల్లాలో 21,048 మంది లబ్దిదారులకు రూ.22.66 కోట్లు లబ్దిదారులకు జమచేయడం జరిగిందన్నారు . అదే విధంగా జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 19,627 మంది లబ్దిదారులకు రూ.42 లక్షలు వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద లబ్దిదారులకు జమచేయడం జరిగిందన్నారు.  చిరు వ్యాపారాలు చేసుకొనే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద అండగా నిలుస్తోందన్నారు.తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే వడ్డీ రాయితీ తో పాటు తిరిగి వడ్డీలేని రుణాలు పొందవచ్చన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతు జిల్లాలో ఈ విడతలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరువ్యాపారాలు చేసుకునే 16,448 మందికి  వడ్డీలేని రుణాలు మంజూరు అయ్యాయన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతంలో 4,600 మందికి ఈ పథకం ద్వారా ఎటువంటి పూచీకత్తులేకుండా  లబ్దిదారులకు రుణాలు అందిస్తున్నదన్నారు.చిరు వ్యాపారులకు జగనన్న తోడు వారీ జీవితాల్లో మార్పు తీసుకు వస్తుందన్నారు.

About Author