PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి రోజా ఎమ్మెల్యే ఆర్థర్ కు క్షమాపణ చెప్పాలి…

1 min read

– మంత్రి రోజా ,శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి లపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.

– దళిత ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పై అగ్రకుల వివక్ష .

– కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు.

– అంబేద్కర్ కూడలిలో  మానవహారం చేపట్టిన ఎమ్మెల్యే మద్దతు దారులు.

– జనాగ్రహంతో అట్టుడికిన నందికొట్కూరు పట్టణం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్థర్ ను ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవానికి పిలవకుండా అవమానపరిచిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని జిల్లా దళిత సంఘం నాయకులు వాడాల త్యాగరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో జరిగిన  ఇండొర్ స్టేడియం ప్రారంభోత్సవ  కార్యక్రమానికి  పిలవకుండా, ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారంటూ  నందికొట్కూరు నియోజకవర్గం లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన కుల ప్రజా సంఘాల నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్ కు మద్దతుగా మంత్రి రోజా క్షమాపణలు చెప్పాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు.  రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిని అవమానిస్తూ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించిన శాప్ అధికారులపైన, మంత్రి రోజా, శాప్ చైర్మన్ సిద్దార్థ రెడ్డి పైన ముఖ్యమంత్రి  తగిన చర్యలు తీసుకోవాలని  లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాడాల త్యాగరాజు మాట్లాడుతూ దళిత నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక  వార్డు మెంబర్ కాదు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారికి ప్రోటోకాల్ ఉండదని అన్నారు. భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే  ఎంపీ స్థానాలకు రిజర్వుడు చేయడం జరిగిందన్నారు . అయితే దీని కాదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇన్చార్జి అంటూ నందికొట్కూరు నియోజకవర్గం లో దళిత ఎమ్మెల్యేను అవమానిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం సిగ్గుచేటన్నారు. మంత్రి రోజా నీకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సన్నిహితము ఉంటే ఆయనకు నీ కూతుర్ని ఇచ్చి అల్లుడిని చేసుకో అని హితవు పలికారు. మంత్రి రోజా నియోజకవర్గమైన నగరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం పెరిగిపోయిందని వైసిపి పార్టీ అధిష్టానం వద్ద మొరపెట్టుకొని ఏడ్చిన నీవు నందికొట్కూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే లేకుండా ఎలా కార్యక్రమంలో పాల్గొంటావని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి రోజా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఎమ్మెల్యే ఆర్తర్ కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ దళితుడు  అనే కారణంతోనే సొంత పార్టీ నేతలే అవమానాలకు గురి చేస్తున్నారని  నంద్యాల జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సగినేల వెంకటరమణ  పేర్కొన్నారు. మంత్రి ఆర్కే రోజా గతంలో తనకు మంత్రి పదవీ లేని రోజుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నగరి నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానాలకు గురి చేశారని ప్రివిలేజెస్ కమిటీ కి పిర్యాదు చేసి కన్నీటి పర్యంతమైన రోజా, నేడు మంత్రి అయ్యాక ఒక దళిత ఎమ్మెల్యే ను అలాగే అవమానాలకు గురి చెయ్యడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. నందికొట్కూరు నియోజకవర్గం లో అగ్రవర్ణ నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్ ప్రజా సేవకు చూసి ఓర్వలేకే ఆనాడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన లో, నేడు మంత్రి ఆర్కే రోజా పర్యటన కు పిలవకుండా, ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఫోటో లేకుండా అవమాన పరిచారన్నారు . కనీసం నంద్యాల ఎంపీ పోచా బ్రంహా నంద రెడ్డి కి కూడా ఎమ్మెల్యే ను పిలవాలని జ్ఞాపకం రాకపోవడం బాధాకరం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్దిలో భాగంగా రెండు ఇండోర్ స్టేడియం లు నిర్మిస్తే  స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ ను పిలవక పోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు డాక్టర్ రాజు మాదిగ, నగేష్, ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు తప్పెట ప్రసాద్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ సుకుర్, హౌసింగ్ డైరెక్టర్ రమాదేవి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రామసుబ్బయ్య, కౌన్సిలర్లు ధర్మారెడ్డి, జాకీర్ హుస్సేన్, సింగిల్ విండో చైర్మన్ ఉషనయ్య, వైసీపీ నాయకులు. టీ అయ్యన్న, రమేష్ ,ఏసేపు, పెరుమాల జాన్, తమ్మడపల్లె విక్టర్, మహిళా సంఘం విభాగం డా. వనజ, మాల మహానాడు నాయకులు పబ్బతి శివప్రసాద్, వనమూల నాగన్న. ఎస్సీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దిలీప్ దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author