PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎం.డి.యు వాహనాల ద్వారా జేవీకే పుస్తకాల సరఫరా..

1 min read

– ఏలూరులోని జె.వి.కె స్టాక్ పాయింట్ ని పరిశీలించిన డీ.ఈ.ఓ  పి.శ్యాంసుందర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లాలో  మండల కేంద్రాల్లో జగనన్న విద్యా కానుక కిట్ల స్టాక్ పాయింట్లలో ఉన్న సెమిస్టర్ 2కు సంబం ధించిన పుస్తకాలను ఎం.డి. యు వాహనాల ద్వారా పాఠశాలకు పంపుతున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యాం సుందర్  చెప్పారు. సెమిస్టర్ 2 పుస్తకాల పంపిణీకి సంబంధించి ఏలూరు సెయింట్ జెవియర్ ఉన్నత పాఠశాలలో ఉన్న మండల ఏం.టి బుక్స్ స్టాక్ పాయింట్  ను మంగళవారం ఉదయం జిల్లా విద్యాశాఖాధికారి పరిశీలించారు. ఈ సందర్బంగా డీఈవో మాట్లాడుతూ  గతంలో జగనన్న విద్యాకనుక కిట్లను స్టాక్ పోయింట్ల నుంచి ఉపాధ్యాయులకు అప్పగించేవారమన్నారు. వారు  ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో పాఠశాలలకు తరలించుకునే వారని తెలిపారు. దానివల్ల ఉపాధ్యాయులు పలు  అవస్థలు పడటాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో స్టాకింగ్ పాయింట్స్ నుంచి  ఎం.డి.యు వాహనాల ల ద్వారా పాఠశాలలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయిం చిందన్నారు  సెమిస్టర్ 2 పుస్తకాల పంపిణీ నుంచి ఈ విదానం అమల్లోకి వస్తుంద న్నారు.  మంగళవారం నుంచి పంపిణీ ప్రారంభం అవుతుం దని  డీఈవో  చెప్పారు. పంపి ణీ సమయంలో మండల విద్యాశాకాధికారులు, సి.ఆర్.పి లు, ఉపాధ్యాయులు సమన్వ యంతో పనిచేయాలని, పాఠశాలకు అవసరం ఉన్నంత వరకే పంపిణీ జర్గలనన్నారు. మండలంలో ఒక్క విద్యార్థికి కూడా జగనన్న విద్యా కిట్లు అందలేదనే మాట రాకుండా డీఈవోలు చర్యలు తీసుకోవా లని సూచించారు. అనంతరం జేవీకే స్టాక్ పాయింట్లలో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు మండల విద్యా శాఖాధికారి ఆర్.రంగయ్య, జె వి.యర్ పాఠశాల ఆంగ్ల, తెలుగు మధ్యమ ప్రధానోపాధ్యాయిలు తోట రోజారాని, రాజ్ ప్రసాద్ లు,  సీఆర్పీలు దారం సునీత, దివ్య, సంధ్య, ఖాన్, లక్ష్మీ, లు పాల్గొన్నారు.

About Author