PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి..?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన నేప‌థ్యంలో లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ప‌ట్నం నుంచి ప‌ల్లె దాక ప్రజ‌లు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. రుచిక‌ర‌మైన ఆహారం తినాలంటే గ‌తంలో హోట‌ల్ కి వెళ్లి తినేవాళ్లం. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. కాబ‌ట్టి చాలా మంది ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఆన్ లైన్ ఫుడ్ డెలివ‌రీకి అనుమ‌తి ఉండ‌టంతో అంద‌రూ ఇదే బాట‌ప‌ట్టారు. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న కొన్ని హోట‌ల్లు వినియోగ‌దారుల మీద అద‌న‌పు చార్జీల‌తో బాదుతున్నాయి. హోటల్ లో ఒక రేటు ఉంటే.. ఆన్ లైన్ డెలివ‌రీకి ఇంకో రేట్ పెడుతున్నారు. దాదాపు 100 నుంచి 200 మ‌ధ్య వ్యత్యాసం ఉంటోంది. ఫ‌లితంగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే ఫుడ్ కాస్ట్లీ గా మారింది. అద‌న‌పు పన్నులు, హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ చార్జీల పేరుతో అధికంగా వ‌సూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే బ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్పడింది. ఒక‌వేళ ఎవ‌రికైన ఇలాంటి అనుభ‌వం ఎదురైతే.. సంబంధిత హోటళ్లు, వ్యక్తుల మీద వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.

About Author