ఇంటింటికి వెళ్లి- ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్ చేయాలి
1 min read– బి ఎల్ ఓ లు, సూపర్వైజర్ల సమావేశంలో తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: బిఎల్వోలు, సూపర్వైజర్లు, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్ తెలిపారు, మంగళవారం ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో, బి ఎల్ వో లకు, సూపర్వైజర్లకు ఓటర్ల జాబితా, గ్రామంలో చేపట్టవలసిన విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బి ఎల్ వో లు, సూపర్వైజర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ కొత్తగా పెళ్లయిన వారికి ఓటు ఎక్కించడం, అలాగే చనిపోయిన వారు ఎవరైనా ఉంటే జాబితాలో నుండి తొలగించడం చేయాలన్నారు, అంతేకాకుండా ఎవరైనా గ్రామం నుండి పర్మినెంట్ గా వెళ్ళిపోయి ఉండి ఉంటే వారి పేర్లను కూడా తొలగించాలని, తెలిపారు, అలాగే ఓటర్ కార్డు లో ఫోటోలు వేరే ఉన్నా, పేరు తప్పుగా ఉన్న సరి చేయడం జరుగుతుందన్నారు, దీనికి సంబంధించి 36 పోలింగ్ స్టేషనులకు గాను 36 మంది బి ఎల్ వో లు, సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారని తెలియజేశారు, వీరంతా కూడా గ్రామంలో పర్యటించి నూటికి నూరు శాతం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం జరుగుతుందన్నారు, ఇందుకు సంబంధించి వారి వద్ద ఉన్న యాప్ లో ఓటర్ల డేటా అంతా కూడా పొందుపరచడం జరుగుతుందని తెలిపారు, ప్రతి ఓటర్ కార్డును పరిశీలించినప్పుడు అందులో తప్పు ఒప్పులు కరెక్షన్ కు అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని ఓటర్లకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు, ఈ ప్రక్రియ ఈనెల 21వ తేదీ నుండి జరుగుతుందని ఆయన తెలియజేశారు… ఈ కార్యక్రమంలో బి ఎల్ వో లు, సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.