NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం …

1 min read

– చనిపోయిన పోలీసు కుటుంబాలకు చెక్కులు అందించిన…..జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS  

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:   నంద్యాల జిల్లాలో పనిచేస్తూ అనారోగ్యంతో మరియు వివిద కారణాల చేత మరణించిన ఎస్‌.ఐ మౌలిబాషా, పోలీసు కానిస్టేబుల్ రాజగోపాల్ మరియు నవరత్నరావు  కుటుంబాలకు ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారి నుండి ఆర్ధిక సహాయంగా విడో ఫండ్ ఫండ్ ,కార్పస్ ఫండ్ ఫగ్ ఫండ్ కింద 1). మౌలిబాషా  భార్య జమీలాబీకి 1,00,000/- రూపాయల చెక్కును, 2). రాజగోపాల్  భార్య రమణమ్మకి 75,000/- రూపాయల చెక్కును 3). నవరత్నరావు  భార్య అర్చనకి 1,75,000/- రూపాయల చెక్కును నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి IPS  చేతుల మీదుగా  ఈ అనగా 19-07-2023 న నంద్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యలయం లో చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  గమాట్లాడుతూ, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మృత్యువాత పడిన పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.మీకు ఏ సహాయం కావాలన్న ఫోన్ ద్వారా గాని లేదా స్వయంగా జిల్లా పోలీసు కార్యలయంలో  సంప్రదించవచ్చు అని జిల్లా ఎస్పీ  తెలియజేశారు.

About Author