యూనిఫాం సివిల్ కోడ్ ను మేము వ్యతిరేకిస్తాం
1 min read– మహమ్మద్ ఆదం మైనారిటీ నాయకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: యూనిఫామ్ సివిల్ కోడ్ ను మేము వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తెస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ వల్ల మత ఆచారాలు దెబ్బతింటాయి హిందూ ,ముస్లిం క్రిస్టియన్ ఇలా రకరకాల మతాల సంప్రదాయాలు వారికి ఉన్నాయి యూనిఫాం సివిల్ కోడ్ వల్ల ప్రజల మత స్వేచ్ఛ పై భారీ ప్రభావం పడుతుంది. పెళ్లి ఆస్తి పంపకాలు విడాకులు వరకు వేరువేరుగా చట్టాలు ఉన్నాయి ప్రస్తుతం యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయడం వల్ల అన్ని మతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది అనుకోవడం లేదు బిజెపి కన్నా ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి చర్చించిన విషయం మనందరికీ తెలిసిందని ఆయన పేర్కొన్నారు.