సచివాలయం పరిధిలో గడప గడపకు-మన ప్రభుత్వం
1 min read– ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే గడప గడపకు-మన ప్రభుత్వం కార్యక్రమం.
– గ్రామంలో నూతన సచివాలయం ప్రారంభించిన మంత్రి గుమ్మనూరు
– గ్రామంలో వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి మొత్తం 5కోట్ల16లక్షల 30వేలు రూపాయలు
– జల జీవన మిషన్ క్రింద గ్రామానికి 44లక్షలు రూపాయలు మంజూరు అయిన ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాము.
– సచివాలయం నిధులు నుంచి 20లక్షలు,డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు కోసం ఖర్చు చేయండి.
– జగనన్న సురక్ష వల్ల ఈ గ్రామానికి 415మంది లబ్ది పొందారు.
– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు.
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే గడప గడపకు-మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం హోళగుంద మండలం,ఇంగళదహాల్ గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు-మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ముందుగా గ్రామ నూతన గ్రామ సచివాలయాని లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ… గ్రామ సచివాలయం/వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్ర ప్రభుత్వం ద్వార నెరవేరింది అన్నారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అధికారులతో కలిసి ప్రతి ఇంటిని దర్శించి వారి యెక్క సమస్యలను క్షేత్ర స్థాయి లో తెలుసుకొని వారి సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ప్రజలకు అవసమైన 11 రకాల సర్టిఫికెట్ లు జగనన్న సురక్ష ద్వార గ్రామాల్లో 415 అర్జీ దారులకు ఒక్క పైసా అవినీతి లేకుండా ఉచితంగా సర్టిఫికెట్ లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో వివిధ సంక్షేమ పథకాలు ద్వారా సుమారు 5కోట్ల16లక్షల 30వేలు రూపాయలు లబ్ధి చేకూరింది అన్నారు. జల జీవన మిషన్ క్రింద గ్రామానికి 44లక్షలు రూపాయలతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిచెందుకు ప్రతి పదాలను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం సచివాలయం నిధులు ద్వారా 20లక్షలు,డ్రైనేజీ మరియు సీసీ రోడ్డులకు నివేదికలు తయారుచేసి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు,గుమ్మనూరు శ్రీనివాసులు గారు,గ్రామ సర్పంచ్ ప్రమిదాతమ్మ,ఎంపీటీసీ బి. మల్లికార్జున, ఎంపీపీ తనయుడు ఈషా, జడ్పీటీసీ బావ మరిది శేషాప్ప,మండల కన్వీనర్ షఫీ,నాయకులు ప్రహ్లాదరెడ్డి, వెంకటరామిరెడ్డి, సచివాలయం కన్వీనర్ వెంకట్ రాముడు,కర్ణ,మండల నాయకులు,సచివాలయం సిబ్బంది, అధికారులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.