NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు టికెట్ విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో అధినేత చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ చెప్పారు. విజయవాడలో పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు నాయుడును కలిసినట్లు భరత్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు భరత్ అన్నారు. ఇప్పటివరకు కర్నూలు నియోజకవర్గం ఇంచార్జిగా తానే ఉన్నానని.. వచ్చే ఎన్నికల్లో టిడిపి కర్నూలు నియోజకవర్గం అభ్యర్థిగా కూడా తానే పోటీ చేస్తానని ఈ విషయంలో చంద్రబాబు నేతలందరికీ క్లారిటీ ఇచ్చారని భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, కలిసికట్టుగా పనిచేయాలని సూచించారన్నారు. ఇక కర్నూలు నియోజకవర్గంలో అన్ని కులమతాలతో పాటు అన్ని వర్గాలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటుచేసి నెల రోజుల్లోపు తనకు అందజేయాలని చంద్రబాబు సూచించారని భరత్ పేర్కొన్నారు. పార్టీ అప్పజెప్పిన ప్రతి పనిని బాధ్యతగా పూర్తి చేయాలని.. కార్యకర్తలు, నేతలు అందరూ ఈ విషయంలో బాధ్యతగా ఉండాలని చంద్రబాబు సూచించారని టిజి భరత్ చెప్పారు. కర్నూల్లో తాము ఇంటింటికీ తిరిగి చేపడుతున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గురించి అధినేతకు వివరించినట్లు భరత్ తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో టిడిపి నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేంద్ర, పోతురాజు రవి, గున్నామార్క్, శ్రీనివాసమూర్తి ఉన్నారు.

About Author