PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీజీహెచ్​లో బెడ్స్​ కొరత ఉండకూడదు..!

1 min read

– జెర్మన్ హ్యాంగర్లు తాత్కాలిక అదనపు బెడ్స్​ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రులు, నగర మేయర్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, నగర మేయర్​ బీవై రామయ్య అన్నారు. గురువారం జీజీహెచ్​లో 100 అదనపు బెడ్స్​ గల జెర్మన్​ హ్యాంగర్ల తాత్కాలిక ఆస్పత్రిని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె. సుధాకర్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె.బాలాజీ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జిక్కి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కరోన పేషెంట్లకు బెడ్స్ కొరత రాకుండా ఉండేందుకు కర్నూల్ జీజీహెచ్, కోవిడ్ కేర్ సెంటర్, నంద్యాల హాస్పిటల్, కోవిడ్ కేర్ సెంటర్లలో జెర్మన్ హ్యాంగర్లు అదనపు బెడ్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు.

About Author