NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మణిపూర్ లో జరిగిన ఘటన కారకులను వెంటనే శిక్షించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : మణిపూర్ లో జరిగిన ఘటన యావత్ దేశ ప్రజలు హృదయాలను కలచి వేస్తుందని ఘటన కారుకులను వెంటనే శిక్షించాలని, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసఫ్ అన్నారు స్థానిక జిల్లా కార్యాలయంలో  ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో యూత్ కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్  మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని యావత్ దేశ ప్రజల హృదయాలను కలచివేస్తుందని ఆయన అన్నారు ఏదైతే మణిపూర్ లో ఇద్దరు మహిళలను బట్టలు లేకుండా నగ్నంగా రోడ్లపై ఊరేగిస్తూ పైశాచి క ఆనందాన్ని పొందిన నేరగాళ్లను వెంటనే శిక్షించాలన ఆయన అన్నారు. ఈ దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతుందని మరోసారి రుజువయిందిని, ఈ దేశంలో ఏనాడైతే బిజెపి ప్రభుత్వం ఏర్పడిందో ఆనాటి నుండి మహిళలకు , అట్ట అడుగు వర్గాలకు రక్షణ లేకుండా పోతుందని బిజెపి పాలిత ప్రాంతమైన మణిపూర్ లో రోజురోజుకు నేరాలు,-ఘోరాలు, పెరిగిపోతున్న దానికి కప్పిపుచ్చేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మరల జరగకుండా ఉండాలంటే నేరస్తులపై ఎస్సీ. ఎస్టీ .అట్రాసిటీ కేసు లు పెట్టాలని, తగిన శిక్ష లు వేసి తగిన చర్యలు  తీసుకోవాలని ఆయన అన్నారు. ఇలాంటి నేరాలు చేసే వారికి భయపడే శిక్షలు అమలు చేయాలని అన్నారు  న్యాయస్థానం వీటిని త్వరగా పరిష్కరించి బాధితులకు తగని న్యాయం చేకూర్చాలని బిజెపి ప్రభుత్వవైఖరి మార్చుకోకపోతే తాము చూస్తూ సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకూ దేశ ప్రజలు,  కాంగ్రెస్ కుటుంబం మొత్తం వారికి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

About Author