అధిక వర్షాలతో అధికారులు అప్రమత్తం ..
1 min read– పెదవేగి మండలంలో తాసిల్దార్ నాగరాజు సిబ్బందితో పర్యవేక్షణ..
– ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : పెదవేగి మండలం గత కొద్దిరోజులుగాబంగాళా ఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం వల్లగత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు ఏలూరు జిల్లా ముసునూరు మండలానికి పెదవేగి మండలానికి మధ్య బలివే దగ్గర తమ్మిలేరు పై నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.దీనిటీ రెండు మండలాల రాకపోకలు బంధం తెగిపోయింది.ఈ రహదారి కొట్టుకుపోవడం వల్ల బలివే పరిసర ప్రాంత విద్యార్థులు పెదవేగి మండలం విజయరాయి జిల్లాపరిషత్ హైస్కూల్ కి ప్రతిరోజూ ఇదే రహదారిలో రావాల్సి ఉంది.విద్యార్థులు.ప్రజలు ప్రయాణించడానికి సత్వర చర్యలపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి పెదవేగి తహసీల్దార్ నల్లమెల్లి.నాగరాజు గురువారం బలివే విజయరాయి గ్రామాల మధ్య తమ్మిలేరు ఉధృతి తెగిపోయింది రహదారిని పరిశీలించారు.