వర్షాలతో… పిల్లలు జాగ్రత్త …
1 min read– బచ్ పన్ స్కూల్ ఉచిత వైద్య శిబిరం
పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : వర్షాకాలంలో చిన్నపిల్లలు తగినంత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు కిమ్స్ కడల్స్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డా. నిఖిల్ తెన్నేటి. మంగళవారం కిమ్స్ కడల్స్ మరియు గాజువాక ప్రాంతానికి చెందిన బచ్ పన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పాఠశాలకు చెందిన దాదాపు 150 మంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షకాలంలోనే అనేక వ్యాధులు చిన్నారులను ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, జ్వరం వంటి తరుచూ వస్తుంటాయి. పాఠశాల నుంచి వచ్చిన వెంటనే చిన్నారులకు వేడి నీటితో స్నానం చేయించాలని సూచించారు. అలాగే వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాల వద్ద లేదా ఇంటి సమీపంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్నారులను చేతులు కడుకోవడం గురించి తప్పకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే…ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యులకు చూపించిన తర్వతే మందులు వాడాలపి సూచించారు. ఈ కార్యక్రమంలో బచ్ పన్ పాఠశాల డైరెక్టర్ బి.ఎం. శ్రీధర్, కిమ్స్ కడల్స్ హాస్పిటల్ కు చెందిన డా. సంతోష్ కుమార్, డా. సూర్యప్రకాష్, డా. మధు, డా. ప్రియాంక నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.