కర్నూలులో వింత.. ఆకాశం నుంచి పడ్డ పసుపు కప్పలు
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా సి.బెలగళ్ మండలం బురాన్ దొడ్డిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు కురిసిన వర్షానికి పసుపు కప్పలు ప్రత్యక్షం అయ్యాయి. పసుపు పచ్చ రంగులో ఉండే కప్పలను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో ఎన్నడూ ఇలాంటి కప్పలను చూడలేదని చెప్పారు. ఇలాంటి ఘటనలు చరిత్రలో చాలా దేశాల్లో అరుదుగా జరిగాయి. ఇదొక వాతావరణ శాస్త్ర దృగ్విషయంగా పేర్కొంటారు. ఎగరలేని జీవులు ఆకాశం నుంచి పడ్డ ఘటనలు అనేక దేశాల్లో చోటుచేసుకున్నాయి. అయితే.. ఈ కప్పల వర్షం లేదా చేపల వర్షం అనే ఘటన ఎందుకు జరుగుతుందనే స్పష్టత ఇంతవరకు ఎవరికీ తెలియదు. కేవలం వీటి మీద కొన్ని ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి.
టోర్నాడిక్ వాటర్ స్పౌట్స్ : టోర్నాడిక్ వాటర్ స్పౌట్స్ అనేది ఒక సైంటిఫిక్ హైపోథీసిస్. ఈ హైపోథీసిస్ ప్రకారం టోర్నాడిక్ వాటర్ స్పౌట్స్ అనేది నీటి మీద ఏర్పడుతుంది. ఈ వాటర్ స్పౌట్స్ నీటిలోని చేపలు, కప్పలను భారీ వేగంతో పైకి.. చాలా దూరం వరకు తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఈ వాటర్ స్పౌట్స్ వేగం తగ్గాక భూమి మీద పడతాయనేది ఈ హైపోథీసిస్ సారాంశం. అయితే.. ఈ హైపోథీసిస్ ను శాస్త్ర వేత్తలు ఇప్పటి వరకు నిర్ధారించలేదు. ఇలా వర్షంతో పాటు చేపలు, కప్పలు భూమి మీద పడటం పట్ల ఎలాంటి స్పష్టమైన శాస్త్రీయమైన నిర్ధారణ లేదు.