ఎనిమిది మండలాలలో గుర్రపు డెక్క తొలగింపు..
1 min read– వివిధ శాఖల సమన్వయంతో పనులు..
– పూర్తిస్థాయిలో పంటలను రక్షించే విధానాన్ని చేపడుతున్నాం..
– జిల్లా వ్యవసాయ అధికారి వై రామకృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా లోని ప్రస్తుతం కురిసిన వర్షాలకు , 26 వ తేదీ నాటికి సుమారు 4,820 ఎకరాలలో పంటలు మునిగిన విధానం కనిపిస్తోందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై.రామకృష్ణ తెలిపారు.పంట పొలాల్లో నీట మునగటానికి గల కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోమని వివిధ శాఖల సమన్వయం తో సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశించిడం జరిగిందన్నారు. దీనికి గాను గత 3 రోజులు నుండి 8 మండలాలలో గ్రామ పంచాయతీ శాఖ కి సంబంధించిన 4 మురుగు కాలువలను , ఇరిగేషన్ శాఖ కి సంబంధించి 8 కాలువలను , ఎన్ ఆర్ ఈ జి ఎస్ శాఖ కి సంబంధించి న వారితో 21 కాలువలను , మున్సిపల్ శాఖ కి మునిసిపల్ పరిధిలో సంబంధించి 2 మురుగు కాలువలను , మొత్తం 36 మురుగు కాలువలు , కాలువల లో ఉన్న తూడు , గుర్రపు డెక్క , కిక్కిస లను ఎన్ ఆర్ ఈ జి ఎస్ కూలీల ద్వారా , జేసిబి ల ద్వారా , ప్రొక్లెయినీర్ల ద్వారా వివిధ శాఖల సమన్వయం తో, ఏ ఏ డి వై సుబ్బారావు పర్యవేక్షణలో తొలగించడం జరిగిందన్నారు.కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పనులు నిర్వహించడం ద్వారా ఇప్పటికీ 2,710 ఎకరాలు లో ముంపునకు గురువైన వరి పంటను ముంపు నుండి తగ్గించడం జరిగిందన్నారు . అక్కడ కూడా పంట తేరుకొనే విధానం కనిపిస్తుందని , ఇది ఇలాగే రాబోయే రోజుల్లో కొనసాగిస్తు రైతులకు పూర్తి సహకారం అందిస్తూ పంటలను రక్షించాలని , ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి , తెలియజేయాలని కోరుతున్నామన్నరు. మరియు పూర్తి స్థాయిలో పంటలను రక్షించే విధానాన్ని చేపడుతున్నామని రైతు సోదరులుకు తెలిపారు.