సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో అన్నారు.ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు వైయస్సార్ పేటెంట్ కాదా? రాయలసీమకు ప్రాణాధారమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచాలని రాజశేఖర రెడ్డి గారు ఉద్యమం చేస్తే తెలుగు దేశం పార్టీ నాయకులతో వ్యతిరేకంగా మీరు ఉద్యమం చేయించినమాట వాస్తవం కాదా?పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు,శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంపు,గోరుకల్లు,అవుకు,గండికోట, మైలవరం,సర్వారాయ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం,మల్యాల, ముచ్చుమర్రి,పైడిపాలెం ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని వీటి గురించి ఎప్పుడైనా చంద్ర బాబు ఆలోచించలేదని మీరు సొంతంగా ప్రారంభించిన పథకం ఏది? పూర్తి చేసిన పథకం ఏది? ఒక్క ప్రోజక్టు చెప్పగలరా..40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ-నీవా ను సాగునీటి ప్రాజెక్టుగా ప్రతిపాదన చేస్తే మీరు ఐదు టీఎంసీల మంచినీటి ప్రాజెక్టుగా మార్చడానికి ఎందుకు ప్రయత్నించారు?మరలా రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాత తిరిగి సాగునీటి ప్రాజెక్టుగా మార్చి పనులు మొదలు పెట్టిన మాట వాస్తవం కాదా?జలయజ్ఞంలో భాగంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీ-నీవా గాలేరు-నగరిని ఎంత శాతం పూర్తి చేశారు.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలన్నప్పుడు ప్రకాశం జిల్లా మీపార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో అభ్యంతరం చెప్పించిన మాట వాస్తవం కాదా..2003లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పర్ భద్ర ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులు మీకు నివేదిక ఇచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ఆయన ప్రశ్నించారు.