వైయస్ఆర్ సంపూర్ణ పోషణతో తల్లీ బిడ్డల సంరక్షణ
1 min read– ఎమ్మెల్యే పి, రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గర్భవతులు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రభుత్వం వారికి సంపూర్ణ పోషకాలు అందించడం జరుగుతుందని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, చెన్నూరు టౌన్ లో స్త్రీ శక్తి భవన్ (వెలుగు కార్యాలయం) లో బుధవారం ఉదయం కమలాపురం ఎమ్మెల్యే పి,రవీంద్రనాథ రెడ్డి గారి చేతుల, గర్భవతులకు, బాలింతలకు మీదుగా వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణి చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దూర దృష్టి గల నాయకుడు కాబట్టి తల్లి బిడ్డల క్షేమం కొరకు, అలాగే వారి ఆరోగ్య దృష్ట్యా ఆరోగ్యకరమైన సంపూర్ణ పోషణ ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, మహిళ లు గర్భం దాల్చిన తర్వాత వారి పేర్లను అటు అంగన్వాడి కేంద్రంలో, ఇటు ఆరోగ్య కేంద్రంలో నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు, అప్పటినుండి వారికి ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల సరైన టీకాలు అందించడంతోపాటు, అంగన్వాడి కేంద్రాలలో సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు, ఎక్కడ కూడా గర్భవతులు, బాలింతలు, రక్తహీనతకు లోను కాకుండా, ప్రోటీన్స్, విటమిన్స్ గల పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు, దీంతో పుట్టబోయే బిడ్డ ఎలాంటి అవయవ లోపాలు లేకుండా ,మంచి ఆరోగ్యంగా ఉండేటట్లు ప్రభుత్వం అన్ని విధాల చూడడం జరుగుతుందని తెలిపారు, అంతేకాకుండా గోరుముద్ద ద్వారా పాఠశాలల్లో చదివే చిన్నారులకు ప్రతిరోజు మెనూ ప్రకారం మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు, దీని ద్వారా మంచి బుద్ధితోపాటు, అవయవాలు సక్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు, దీంతో వారు విద్యాభ్యాసంలో కూడా మంచి మిల్క్వలు సాధించే దిశగా సాగుతారని తెలియజేశారు, ఇంతగా దూరదృష్టితో ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డే నని ఆయన కొనియాడారు,ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే వైయస్ఆర్ సంపూర్ణ పోషణ యొక్క ఉద్దేశమని ఆయన తెలిపారు.పేదరికంతో సరైన పౌష్టికాహారం తీసుకోలేని వారికి ఇది ఒక వరం లాంటిదని, ప్రతినెలా క్రమం తప్పకుండా సంపూర్ణ పోషణ కిట్లు అంగన్వాడి కేంద్రాలలో ఇవ్వడం జరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల్లో షోషకాహార లోపాన్ని అధిగమించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ పౌష్టికాహారం, పాలు, గుడ్లు అందజేయడం జరుగుతుందన్నారు . దీంతో సంపూర్ణ పోషణతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం చేపట్టడమే కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నదాన్ని నిజం చేసి చూపిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగనపల్లి , సురేష్ బాబు, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, సిడిపిఓ రమాదేవి, ఏ పి ఎం గంగాధర్, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, అంగన్వాడి సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, గర్భవతులు, బాలింతలు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.