తల్లిపాలు బిడ్డలకు శ్రేష్టము…
1 min read– ఎంపీడీవో, గంగనపల్లె సురేష్ బాబు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తల్లిపాలు బిడ్డలకు ఎంతో శ్రేష్టమని, తల్లి ముర్రుపాల వల్ల బిడ్డలకు ఎంతో లాభదాయకమని ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, సి డిపి ఓ రమాదేవిలు అన్నారు, వారు చెన్నూరు లోని స్త్రీ శక్తి భవన్ ( వెలుగు కార్యాలయం) నందు ప్రపంచ తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు, ఆగస్టు 1వ తేది నుండి 7వతేది వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారని, అంగన్వాడి కేంద్రంలో గల గర్బవతులకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి తెలపడం జరుగుతుందని తెలిపారు, అలాగే తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రేష్టమని తెలియజేస్తూ పుట్టిన పిల్లలకు 1గంట లోపు వచ్చే పసుపు పచ్చని పాలను బిడ్డ కు ఇవ్వడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని వారు తెలిపారు, రెండు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా తల్లిపాలను బిడ్డలకు అందించవలసినదిగా వారు సూచించారు,అలాగే బాల్య వివాహాలను నిర్మూలించే దిశగా అడుగులు వేయాలని తెలియజేసేందుకే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు, ప్రతి తల్లి కూడా సాధారణ ఉప్పు శాతం వాడకాన్ని తగ్గించి అయోడైజ్డ్ సాల్ట్ ను ఉపయోగించాలని తెలియజేశారు, అయోడిన్ ఉప్పును గర్భవతులు చిన్నపిల్లలు ఇది తప్పనిసరి అని అన్నారు, అనంతరం మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, చీర్ల సురేష్ యాదవ్ లు మాట్లాడుతూ, ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యులందరిక కోసం చేసే వంటల్లో అయోడిన్ ఉప్పు ఉండేలా చూసుకోవాలని వారు తెలిపారు, గర్భవతులు తీసుకునే ఆహారంలో అయోడిన్ లేకపోతే మందబుద్ధి కలిగిన లేదా వినికిడి లోపం, మూగతనం బండి సమస్యలు ఉన్న పిల్లలు పుట్టవచ్చని కొన్నిసార్లు గర్భస్రావాలకు కూడా కారణం అవుతుందని వారు తెలిపారు . శిశువుగా ఉన్నప్పుడు లేదా చిన్నతనంలో పిల్లలకు సరైన మోతాదులో అయోడిన్ లభించకపోతే అతని శారీరక మానసిక ఎదుగుదల లోపిస్తుందని నేర్చుకునే నైపుణ్యాలు లోపిస్తాయని అన్నారు, పెద్దవాళ్లలో థైరాయిడ్ గ్రంధి తక్కువ స్థాయిలో పనిచేయడం మన తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో అయోడిన్ లేనప్పుడు అనేక రకాల రుగ్మతలు అయోడిన్ లోపంతో తలెత్తే వ్యాధులు థైరాయిడ్ వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉందని వారు తెలిపారు, అంగన్వాడి సూపర్వైజర్లు గురమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ టిజే ప్రకాష్, హెల్త్ సూపర్వైజర్ షణ్ముఖం, మహిళా సంరక్షణ కార్యదర్శి చంద్రకళ, వాసవి, ఉమా మహేశ్వరి అంగన్వాడీ టీచర్లు, బాలింతలు గర్భవతులు పాల్గొన్నారు.