PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖైదీలకు ఉచిత న్యాయసేవలపై అవగాహన….

1 min read

జిల్లా కారాగారామును సందర్శించిన

జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు 

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు, శాశ్వత లోక్ అదాలత్ న్యాయమూర్తి ఎం.వెంకట హరినాథ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ యస్ మనోహరు పంచలింగాల గ్రామం నందు గల జిల్లా జైలును సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి  ఖైదీల వివరాలను సంబందిత జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు మరియు వారికి అందించే భోజన సదుపాయాలను స్వయంగా పరిశీలించి, పర్యవేక్షణ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచిత న్యాయసేవల గురించి వివరించారు. 6 5 సంవత్సరాలు పైబడిన ఖైదీల వివరాలు సేకరించి వారి విడులకు ప్రయత్నిస్తామన్నారు. ఖైదీలతో మాట్లాడటానికి వచ్చే వారికి మాట్లాడే సదుపాయాన్ని పరిశీలించారు. అనంతరం ఖైదీల హాజరు పట్టికను పరిశీలించి, ఖైదీలకు ఏదైనా సమస్య వస్తే జిల్లా న్యాయ సేవధికారసంస్థ ను ఆశ్రయించాలని చెప్పారు. వంటగదులు, జైలు గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచలను ఇచ్చారు. సారాయి కేసులలో పట్టుబడిని ఖైదీలకు మీరు సారాయి సరఫరా చేయడం మానుకొని గౌరవంగా జీవించడం నేర్చుకోండి. వాటిని అమ్మడం వలన ఎదుటివారు కొని, త్రాగి వారి జీవితాలను నాశనం చేసుకొంటారు, అమ్మేవారు/మీరేమో పట్టుపడి జైలుపాలు అవుతారు. దీని వల్ల ఇద్దరి జీవితాలు, కుటుంబాలు పాడైపోతాయి అని నిక్కచ్చిగా చెప్పారు. ఉన్నత న్యాయ సేవ  అధికార సంస్థ ఏర్పాటుచేసిన  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ సిస్టమ్ ద్వారా అందిస్తున్న మెరుగైన ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూల్ జిల్లా న్యాయ సేవధికారసంస్థ కార్యదర్శి  సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ కొరకు చెట్లను నాటరు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు, శాశ్వత లోక్ అదాలత్ న్యాయమూర్తి ఎం.వెంకట హరినాథ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీ యస్ మనోహరు గారు, జిల్లా సూపరింటెండెంట్ ఘనే నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు.                  

About Author