పేదలందరికీ… ఇళ్లు
1 min read– నగర మేయర్ సురేష్‌బాబు
– ‘మామిళ్లపల్లి’లో గృహ నిర్మాణాలకు శంకు స్థాపన
పల్లెవెలుగు వెబ్, కడప: పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని నగర మేయర్, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్‌బాబు అన్నారు. గురువారం కడప నగరంలో భాగమైన మామిళ్లపల్లి లే అవుట్లో గృహ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ప్రెన్స్ ద్వారా బటన్ నొక్కి శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, కమలాపురం ఎమ్మెల్యేపి. రవీంద్ర నాథ్ రెడ్డి, కలెక్టర్ సి. హరికిరణ్ , సబ్ కలెక్టర్ పృథ్వీ తేజ్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) ధర్మ చంద్ర రెడ్డి , రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం చైర్మన్ యనదయ్య , 13వ డివిజన్ కార్పొరేటర్ రామలక్ష్మణ రెడ్డి , 14వ డివిజన్ కార్పొరేటర్ కె.బాబు , 15వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మి దేవి , 16వ డివిజన్ ఇంచార్జ్ ప్రసాద్ రెడ్డి , 16వ డివిజన్ కార్పొరేటర్ బి.లక్ష్మి దేవి , 17వ డివిజన్ కార్పొరేటర్ చంద్ర హాస్ రెడ్డి , 19వ డివిజన్ కార్పొరేటర్ వి.శిరీష , 19వ డివిజన్ ఇంచార్జ్ లక్ష్మయ్య , 20వ డివిజన్ కార్పొరేటర్ మాధవి , 20వ డివిజన్ ఇంచార్జ్ రంజన్ , 21వ డివిజన్ కార్పొరేటర్ సుజాత , 21వ డివిజన్ ఇంచార్జ్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.