PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు పంట సాగులో సమగ్ర సస్య రక్షణ పద్ధతులు  పాటించాలి

1 min read

– మొక్కజొన్న పంటలో రైతులకు శిక్షణ..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆత్మ  అద్వర్యంలో జిల్లా ఏరువాక కేంద్రం, నంద్యాల ‘ప్రిన్సిపల్ సైంటిస్ట్’ (సస్యరక్షణ)  డా. ఏ. రామకృష్ణారావు , జిల్లా వనరుల కేంద్రం, నంద్యాల డి.టి.సి , కె. జయదేవ్, ఏ.డి.ఏ లు మంజువాని, సరళమ్మ, ఆత్మా  బిటియం  ఉమామహేశ్వరి, మండల వ్యవసాయ అధికారి, నందికొట్కూరు పి.షేక్షావలి మరియు ‘ ఆర్ బి కే ‘ వి. ఏ.ఏ స్ సంయుక్తంగా కలిసి నందికొట్కూరు మండలంలోని ‘మల్యాల’ గ్రామం లో ప్రస్తుత పంటలలో సమగ్ర సస్య రక్షణ పద్ధతుల పై బుధవారం శిక్షనా మరియు మొక్కజొన్న పంట పొలాలలో క్షేత్ర సందర్శన చేపట్టారు .ఈ సందర్భంగా డిప్యూటీ ట్రైనింగ్ కో ఆర్డినేటర్  జయదేవ్ మాట్లాడుతూ రైతులు విచక్షానా రహితంగా రసాయనక  ఎరువులు మరియు పురుగుమందులు పిచ్చికారీ చేయకుండా ప్రత్నాయంగా జీవన ఎరువులు, జీవ సంబంధ పురుగుమందులు  పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు.అనంతరంఏ. రామకృష్ణారావు  ప్రిన్సిపల్ సైంటిస్ట్ రైతులకు ఈ క్రింది వ్యవ సాయ సుచనలు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రస్తుతం వర్షాల వల్ల మొక్కజొన్న పంటలో భాస్వరం ధాతు లోపం ఉన్నట్లు, నివారణకు గాను 19-19-19 లేదా 20-20-20 ఏకరానికి 1 కేజీ( 5 గ్రా/ లీ నీటికి) పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగినది.మినుము, మిరప, సోయా చిక్కుడు పంటల లో ఎండు తెగులు నివారణకు గాను బ్లైటాక్స్: 3గ్రా లేదా బావిస్తిన్: 2 గ్రా/లీ. నీటికి పిచికారి చేసుకోవాలని సూచించారు.

మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు ఆశించి నష్టం కలగజేస్తున్నట్లు గమనించడం జరిగినది. కత్తెర పురుగు నివారణకు గాను లింగాకర్షక బుట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చాలన్నారు.. 

 విత్తినప్పటి నుండి 25 రోజుల వరకు:

5 శాతం వేప గింజల కషాయాన్ని (లేదా) అజాడిరక్టిన్ 1500 పీ.పి.యం. 5 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. విత్తిన 25 రోజు నుండి 40 రోజుల వరకు:కత్తెర పురుగు లార్వాలను నివారిరించడానికి ఒక ఎకరాకు5-20 శాతం  ఆకులు దెబ్బతింటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రా, 20 శాతం   ఆకులు దెబ్బతింటే  ఏకరానికి రైనాక్సిఫైర్  100 మి.లీ. స్పైనోటరామ్  100 మి.లీ. పిచికారి చేయాలని సూచించారు.

విత్తిన 40 రోజు నుండి 60 రోజుల లోపు:స్పైనోసాడ్ – 70 మి.లీ,రైనాక్సిపైర్ – 80 మి.లీ.

స్పైనోటరామ్ 100 మి.లీ. ఎమామెక్టిన్ బెంజోయేట్ – 80 గ్రా. థయేమిథాక్సామ్ మరియు లామ్డా సైహలోత్రిన్  100 మి.లీ. అనే పురుగు మందులను  ఒక ఎకరాకు  రైతులు పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవసాయ సుచనలను రైతు భరోసా కేంద్రాల  ద్వారా రైతులకు  తెలియ జేయవలసిందిగా డా. ఏ. రామకృష్ణా రావు కోరారు.

About Author