సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోండి…
1 min read– శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజి ఏం .సురేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక బుధవారపేట లోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు నేషనల్ స్పేస్ సొసైటీ (NSS)ప్రాజెక్ట్ కు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానాచార్యురాలు రాఘవ లక్ష్మి హర్షం వ్యక్తం చేసారు .గురువారం ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నేషనల్ స్పేస్ సొసైటీ 6 వ తరగతి నుండి 10 వ తరగతి చదివే విద్యార్థుల నుండి పరిశోధనలను ఆహ్వానిస్తుందని ,అందులో భాగంగా తమ పాఠశాల విద్యార్థులు రూపొందించిన అబ్దుల్ కలాం స్పేస్ కాలనీ “అనే ప్రాజెక్ట్ ఎంపిక కావడం జరిగిందని చెప్పారు .శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజి ఏం సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకొవలెనని సూచించారు .పాఠశాల సమన్వయకర్త రమణయ్య మాట్లాడుతూ విద్యార్థులు సాధారణ విద్యతో పాటు పరిశోధనా పరమైన సాంకేతిక విద్యను నేర్చుకోవలెనని తెలిపారు .పాఠశాల ఆర్ .ఐ .వి .వెంకటేష్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ ఎంపిక కావడం తమ విద్యార్థుల,ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు .అనంతరం విద్యార్థులకు మెడల్స్ ,సర్టిఫికెట్ లు ప్రదానం చేసారు .ఈ కార్యక్రమం లో డీన్ వీరయ్య ఆచారి ,ప్రాథమిక బాధ్యురాలు రమ్య ,విద్యార్థులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.