‘ రహదారి’ ని పెండింగ్ లో ఉంచొద్దు..
1 min read– ఎన్హెచ్ అధికారులను ఆదేశించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: జాతీయ రహదారి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అధికారులను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. రాయచోటిలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎన్ హెచ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ఎంఎల్ సి జకియా ఖానం, ఎన్ హెచ్ ఈ ఈ ఓబుల్ రెడ్డితో కలసి ఆయన నియోజక వర్గ పరిధిలో జరుగుచున్న ఎన్ హెచ్ పనుల స్థితిగతులపై ఆరా తీశారు. పట్టణంలోని ఠాణా వద్ద పెండింగ్ లో ఉన్న ఎన్ హెచ్ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తిచేయించాలన్నారు. చెక్ పోస్ట్ శివాలయం నుంచి మదనపల్లె రహదారి మార్గపు రింగ్ రోడ్డు విస్తరణ పనులను ఒక నెల లోపు పూర్తి చే. మండలకేంద్రమైన చిన్నమండెంలో 1.5 కిమీ మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలో పెం14 బస్ షెల్టర్లును త్వరితగతిన నిర్మించాలన్నారు.రాయచోటి- వేంపల్లె ఎన్ హెచ్ లో భాగంగా మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లెలో నాలుగువరుసల రహదారి పనులను చేపట్టాలని అధికారులును శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా, జెడ్పిటీసీ వెంకటేశ్వర రెడ్డి, మాజీ జెడ్ పి టి సి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె తహశీల్దార్ లు సుబ్రమణ్యం రెడ్డి, తులసమ్మ, మున్సిపల్ కమిషనర్ రాంబాబు, ఆర్ అండ్ బి డి ఈ సురేష్ నాయక్, ఎన్ హెచ్ ఏ ఈ రఘనాధ, వైఎస్ఆర్ సీపీ నాయకులు హాబీబుల్లా ఖాన్, మదనమోహన్ రెడ్డి,బేపారి మహమ్మద్ ఖాన్, కొలిమి హారూన్, ఫయాజ్ అహమ్మద్,విజయ భాస్కర్, రియాజ్, సయ్యద్ అమీర్ పాల్గొన్నారు.