PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

1 min read

– పశుసంవర్ధక శాఖ జెడి శారదమ్మ

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  మండలంలోని పాడే రైతులు పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ జెడి శారదమ్మ అన్నారు, గురువారం కొండపేట గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ అలాగే డి ఎల్ డి ఏ కడప వారి సంయుక్త పర్యవేక్షణలో లేగ దూడల ప్రదర్శన నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ జెడి  పాల్గొని మాట్లాడారు, పాడి రైతులు పశు పోషణ పై అవగాహన పెంపొందించుకోవాలని దీని ద్వారా లేగ ధూడలను సంరక్షించు కున్నట్లవుతుందన్నా రు, అంతేకాకుండా ఏదైనా  ప్రమాదం సంభవించినట్లయితే రెండు నెలల లోపే నష్టపరిహారం పొందవచ్చని ఆమె తెలియజేశారు, వాతావరణ వల్ల వచ్చే వ్యాధులను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పశువులకు టీకాలు వేయించాలని ఆమె తెలిపారు, అలాగే రాయితీ ద్వారా పశు దాన కిలో ఆరు రూపాయల 50 పైసలు చొప్పున ప్రభుత్వం అందిస్తుందని రైతులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని తెలిపారు, అనంతరం గ్రామంలోని పది రోజుల నుండి ఏడు నెలల వయసున్న లేగ దూడలను ప్రదర్శించారు, ఈ ప్రదర్శనలో సుమారు 46 మంది రైతులు పాల్గొనడం జరిగింది, ప్రదర్శనలో విజేతలైన పాడి రైతులకు మొదటి బహుమతిగా స్టీల్ బకెట్, ద్వితీయ తృతీయ బహుమతులుగా పాలకేండ్లను అందించడం జరిగింది, పశు వైద్య అధికారులు నిర్వహించే ఏ అవగాహన సదస్సులో రైతులు పాల్గొని అధికారులు ఇచ్చే పలు సూచనలు సలహాలను పొద్దునట్లయితే రైతులు అధిక లాభాలు పొందవచ్చునని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీటీసీ నాగిరెడ్డి, ఎంపీడీవో సురేష్ బాబు, డి ఎల్ డి ఏ సంస్థ చైర్మన్ మాధవరెడ్డి, వెంకట రమణయ్య, రమేష్, ఏడి మునయ్య, పశు వైద్యులు డాక్టర్ ఉపేంద్ర, డాక్టర్ శివరామిరెడ్డి, డాక్టర్ ఎర్రపురెడ్డి, పశువైద్య సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.

About Author