బాలింతలు గర్భిణీలకు ‘సంపూర్ణ’ పోషణ తోనే ఆరోగ్యం
1 min read– గర్భిణీలు,బాలింతల కోసం ‘టేక్ హోమ్ రేషన్’ సరుకులు పంపిణీ
– సీఎం జగన్ మహిళా పక్షపాతి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గర్బిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తోన్న వైఎస్సార్ సంపూర్ణ పోషణ టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమం మహిళలకు ‘సంపూర్ణ ఆరోగ్యం’ లాంటిదని 13వ వార్డు కౌన్సిలర్ శాంత కుమారి 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ షేక్ రేష్మ అన్నారు. గురువారం పట్టణంలోని 15వ వార్డు సాయి బాబా పేట అంగన్వాడీ కేంద్రంలో కౌన్సిలర్ శాంత కుమారి, 5 వ వార్డు పరిధిలోని అంగన్వాడీ సెంటర్ 6 లో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని కౌన్సిలర్ రేష్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు,బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాలను అమలుచేస్తుందని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు.గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల్లో పోషకాహార లోపంతో కలిగే రక్త హీనత,ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు వంటి ఆనారోగ్య సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. నెలకు అవసరమయ్యే 10 రకాలైన వస్తువులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.గర్భిణీలు, బాలింతలకు వారి ఇళ్ల వద్దకే ఈ పౌష్టికాహార కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. అనంతరం గర్భిణులు బాలింతలక కిట్లను అందించారు ఈ కార్యక్రమంలో ఐదో వార్డు ఇంచార్జి సన అబ్దుల్లా,వైసీపీ నాయకులు పాలమర్రి రమేష్, మార్కెట్ రాజు,అంగన్వాడి కార్యకర్తలు శ్యామల, కుసుమకుమారి, ఆశా కార్యకర్త నజిమున్నిసా, మహిళా పోలీస్ హరిత, అంగన్వాడి ఆయా కమాల్ బి పాల్గొన్నారు.