PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటింటికి వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ చేయండి..

1 min read

– ఏ ఈ ఆర్ ఓ. టీ శ్రీనివాసులు…

పల్లెవెలుగు వెబ్ గడివేముల: 2024లో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జులై 21 నుండి ఓటర్లను గుర్తించడం సవరణ తదితర ప్రక్రియపై మొదలైన కార్యక్రమం గురించి గురువారం నాడు తాసిల్దార్ కార్యాలయంలో ఏఈఆర్ఓ శ్రీనివాసులు. గురునాథం .బిఎల్ఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా  బిఎల్ఓ యాప్ ద్వారా నమోదు చేసుకునేలా 100 సంవత్సరాలు ఉన్న  ఓటర్లను గుర్తించడం మృతి చెందిన ఓటర్లను తొలగించడం వికలాంగ ఓటర్లను గుర్తించడం డోర్ నంబర్లు లేనివారికి గుర్తించి బి ఎల్ వో అప్ లో నమోదు చేయాలని అలాగే ఒక పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలింగ్ స్టేషన్ కి మారాలంటే ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అలాగే ఫోటో డోర్ నెంబర్ మార్చుకోవడానికి బి ఎల్ ఓ యాప్ ద్వారా అవకాశం ఉంటుందని ఇవన్నీ ఇంటింటికి వెళ్లి ఓటర్లకు చైతన్యవంతం చేయాలని ఈనెల 21 తేదీలలో ఓటర్ వెరిఫికేషన్ చేసి సదరు అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు అందజేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆపరేటర్ సూరి బిఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులు గ్రామ మహిళ సంరక్షకురాలు వీఆర్వోలు పాల్గొన్నారు.

About Author